చిరంజీవి, మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడుకున్నారు

‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా అయిపొయింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా దీనికి నిదర్శనం. చిరంజీవి తనను ‘మా’ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగమని అడిగారంటూ విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా మంచు విష్ణు తండ్రి మోహన్ బాబుకు ఫోన్ చేసి, ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్ ప్రవర్తించిన విధానంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారని, బాధ పడ్డారని వార్తలు వస్తున్నాయి.

Read Also : సీసీటీవీ ఫుటేజ్ వివాదంపై మంచు విష్ణు కామెంట్స్

తాజా ప్రెస్ మీట్ లో ఈ విషయంపై స్పందించిన మంచు విష్ణు మాట్లాడుతూ చిరంజీవి, మోహన్ బాబు గారు ఫోన్ లో మాట్లాడుకున్నారని, కానీ వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని, ఆ విషయం వారే స్వయంగా వెల్లడించాలి లేదా మీడియా వాళ్లనే ప్రశ్నించాలని అన్నారు. మరి బహిరంగంగానే విమర్శలు చేసుకున్న చిరు, మోహన్ బాబు ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles