ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రం షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా ఈ పాన్ ఇండియా మూవీ తొలి భాగం విడుదల కాబోతోంది. దీని తర్వాత అల్లు అర్జున్ ‘ఐకాన్’ చిత్రానికే డేట్స్ కేటాయించాడని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే ఈ మూవీలో ఐకాన్ స్టార్… ఇద్దరు అందాల భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నాడట. వీరు మరెవరో కాదు! పూజా హెగ్డే అండ్ రశ్మిక మందణ్ణ అని తెలుస్తోంది. సహజంగా హీరోయిన్స్ ను రిపీట్ చేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేసే అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం తన అలవాటును మార్చుకున్నాడు. తనతో నటించిన హీరోయిన్స్ తో మళ్ళీ మళ్ళీ చేయడానికి వెనుకాడటం లేదు. అందుకే వీరిద్దరినీ దర్శక నిర్మాతలు అప్రోచ్ అవుతామని చెప్పగానే బన్నీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే అల్లు అర్జున్ తో ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠ పురములో’ చిత్రాలలో నటించింది. ఇక రశ్మిక మందణ్ణ తొలిసారి అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. ఇది కూడా రెండు భాగాలుగా వస్తుంది కాబట్టి… ఓ రకంగా ఈ ఇద్దరు హీరోయిన్లకు బన్నీతో ‘ఐకాన్’ మూడో సినిమా అవుతుంది.
Read Also : ఇది కదా గెలుపు… మీరాబాయి చానుకి మెగాస్టార్ సెల్యూట్
ఇదిలా ఉంటే… వేణు శ్రీరామ్ తో ‘దిల్’ రాజు తీసిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘వకీల్ సాబ్’కు తమన్ సంగీతం అందించాడు. ఆ సినిమా మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది. దాంతో ‘ఐకాన్’కు కూడా తమన్ సంగీతం అందిస్తాడని అంతా భావించారు. అయితే.. ‘ఐకాన్’ను పాన్ ఇండియా మూవీగా తీసుకు రావాలని భావిస్తున్న బన్నీ… ఈ చిత్రానికి తమన్ కాకుండా ఎవరైనా బాలీవుడ్ సంగీత దర్శకుడు మ్యూజిక్ చేస్తే బాగుంటుందని అన్నట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు ఆ దిశగా ఉత్తరాది సంగీత దర్శకుడి గురించి అన్వేషణ మొదలు పెట్టారట. అయితే ఈ విషయాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.