NTV Telugu Site icon

Allu Arjun: ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?

Bunny

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్ అయిన సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 68 ఏళ్ళలో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డును సాధించాడు. దీంతో అల్లు వారింట సంబురాలు అంబరాన్ని అంటాయి అన్న విషయం తెల్సిందే. నిన్ననే మీడియావారికి సైతం బన్నీ పార్టీ ఇచ్చాడు. ఇక అభిమానులు ఇప్పటికీ బన్నీకి విషెస్ చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే .. టాలీవుడ్ కు అవార్డు రావడంతో హిందీ మీడియా ఓర్చుకోలేక.. కొన్ని పుకార్లు రేకెత్తించాయి. అందులో ఒకటి.. ఒక స్మగ్లర్ గా నటించిన హీరోకు అవార్డు రావడం ఏంటి.. ? దాన్ని ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది అని ప్రశ్నిస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీ .. ఒక స్మగ్లర్. గంధపు చెక్కలను పోలీసుల కన్ను కప్పి.. లక్షల్లో అమ్మి సొమ్ము చేసుకుంటాడు. అదే పుష్ప కథ. దీంతో అభిమానులు బాలీవుడ్ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్కడ చూడాల్సింది పాత్రను కాదు.. నటనను.. ప్రభుత్వం చూసింది నటనను అని చెప్పుకొచ్చారు. తాజాగా బన్నీ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చాడు.

Buchhibabu Sana: బుచ్చిబాబు.. చరణ్ సినిమాతో నీ దశ తిరిగిందయ్యా..

” ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు..? అని నేను అనుకున్నాను.. కానీ, ఇక్కడ లాజిక్ చూడడానికి ఏమి లేదు. లాజిక్ లు వెత‌క్కుండా జూరీ న‌ట‌న‌కు పట్టం కట్టింది. నేను ఈ పాత్రను చేయడానికి చాలా ఆలోచించాను. సాధారణంగా మన భారతీయ సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాను వేరుగా.. పెర్ఫామెన్స్‌ ఉన్న సినిమాలను వేరుగా చూస్తారు. కమర్షియల్ అనగానే నటన గురించి పట్టించుకోరు. నేను ఈ సినిమాను అలాగే తీయాలనుకున్నాను. కమర్షియల్ సినిమాలో కూడా పెర్ఫామెన్స్‌ చేయాలి అనుకున్నాను. అందుకు నాకు ఉదాహరణగా నిలిచిన సినిమాలు రుద్రవీణ, ఘరానా మొగుడు. పెర్ఫామెన్స్‌ అనగానే రుద్రవీణ గుర్తొస్తుంది.. కమర్షియల్ అంగన్ ఘరానా మొగుడు గుర్తొస్తుంది. ఈ రెండు కలిఫై పుష్ప సినిమాలో చేయాలనుకున్నాను. చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగినవాడిగా ఆ రెండు సినిమాలు మైండ్ లో పెట్టుకొని పుష్ప చేశాను. ఇక ఇక్కడ ఇండస్ట్రీకి మనం బలమా.. ? మనకు ఇండస్ట్రీ బలమా..? అనేది కూడా ముఖ్యం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.