అల్లు అర్జున్ ని అవమానించిన కన్నడ మీడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప గురించే టాపిక్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి రెండు రోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. బన్నీ , రష్మిక ఆడా .. ఈడా అని లేకుండా ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లకు అటెండ్ అవుతూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఇక నేడు ఈ జంట కన్నడ మీడియా ముందు హాజరయ్యారు. బెంగుళూరులో జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మీడియాకు క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కి లేటుగా రావడంపై కన్నడ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయం 11.15 నిమిషాలకు ప్రెస్ మీట్ అని చెప్పి.. మీరు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఎలా వస్తారని, ఇక్కడ మీడియాను మీరు అవమానించినట్లే అని ఒక రిపోర్టర్ కొద్దిగా ఘాటుగానే ప్రశ్నించాడు.. ఇక దీనికి బన్నీ సమాధానం చెప్తూ ” ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉందని నాకు ఇందాకే తెలిసింది.. తెలిసిన వెంటనే ప్రైవేట్ జెట్ లో బయల్దేరాను.. మధ్యలో పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్ ఇష్యూ వలన కొద్దిగా లేట్ అయ్యింది.. మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి.. ఇది ఎవరిని హార్ట్ చేయాలనీ చేయలేదు.. సారీ.. సారీ అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సారీ చెప్తే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అని తనదైన స్టైల్ ల్లో బన్నీ తెలిపిన విధానం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బన్నీ సారీ చెప్పడంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ఇండస్ట్రీ హీరో కాబట్టి ఇలా అడగగలుగుతున్నారు.. అదే మీ కన్నడ హీరోలను ఇలా నిలదీయగలరా..? అని కొంతమంది అంటుంటే.. ప్రెస్ మీట్ లో బన్నీ హ్యాండిల్ చేసిన విధానం బావుంది.. అందుకే ఆయన ఐకాన్ స్టార్ గా మారాడు అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా కన్నడ మీడియా అల్లు అర్జున్ ని అవమానించిందని నెటిజన్స్ అబిప్రాయపడుతున్నారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!