NTV Telugu Site icon

Allu Arjun: చరణ్ భార్యపై ప్రేమ కురిపించిన బన్నీ.. ఇది కదా కావాల్సింది

Upasana

Upasana

Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం ఉందా..? లేదా..? అనే క్లారిటీ మాత్రం అస్సలు రావడం లేదు. ఒక్కోసారి వీరి మధ్య బంధాలు చూస్తే అస్సలు గొడవలు లేవు అనిపిస్తూ ఉంటుంది.. ఇంకోసారి అసలు వీరు మాట్లాడుకోరా..? అనేలా ఉంటాయి. ఏదిఏమైనా ఈ గొడవలు పక్కన పెడితే.. మెగా- అల్లు కుటుంబాలు మాట్లాడుకుంటున్నారు అనేది మాత్రం నిజం. తాజాగా అల్లు అర్జున్ పెట్టిన పోస్టే అందుకు నిదర్శనం. రామ్ చరణ్ భార్య ఉపాసనపై బన్నీ ప్రేమను కురిపించేసాడు. రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు కానున్నారు. వారు తమ మొదటి బిడ్డకోసమే ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారే కాదు.. అభిమానులు కూడా మెగా వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చూస్తూ ఉండగానే ఉపాసకు నెలలు నిండుతున్నాయి.

Karthik Dandu: విరుపాక్ష ఇతని ఫస్ట్ మూవీ కాదు… ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా?

ఇక ఈ మధ్యనే చిరు ఇంట ఉపాసన సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. అత్యంత తక్కువ బంధుమిత్రుల మధ్య ఆ సీమంతం జరిగింది. ఇకపోతే ఆ సీమంతం వేడుకలకు బన్నీ కుటుంబం కూడా హాజరయ్యినట్లు తెలుస్తోంది. తాజాగా ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోను బన్నీ షేర్ చేస్తూ.. ” ఉప్సీ ఆర్సీ లైఫ్.. సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సీ” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పింక్ కలర్ డ్రెస్ లో ఉపాసన కనిపించగా.. బ్లాక్ అండ్ బ్లాక్ లో అల్లు అర్జున్ ఎప్పటిలాగే స్టైలిష్ గా కనిపించాడు. ఈ పోస్ట్ తో బన్నీ- చరణ్ మధ్య విబేధాలు ఏమి లేవని తెలుస్తోంది. ఇక ఈ పోస్ట్ చూసిన అల్లు- మెగా ఫాన్స్ ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments