NTV Telugu Site icon

Samajavaragamana : సామనవరగమనపై బన్నీ ప్రశంసల జల్లు

Allu Arjun Samajavaragamana

Allu Arjun Samajavaragamana

Allu Arjun tweet on Samajavaragamana: చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకుంది సామజవరగమన. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలోని ఒక పాటను ఆధారంగా చేసుకుని ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా రెబ్బ మోనిక జాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. గత గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ మంచి కలెక్షన్లు రాబడుతూ ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ప్రస్తుతానికి సక్సెస్ టూర్లు కూడా వీరు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీ విష్ణు స్నేహితుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ట్వీట్ చేశారు. ముందుగా సామజవరగమన సినిమా టీం అందరికీ బన్నీ కంగ్రాట్స్ చెప్పాడు.

Nikhil Siddhartha Apologies: మాట నిలబెట్టుకోలేకపోయా.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్!

ఈ సినిమా చాలా కాలం తర్వాత తెలుగులో వచ్చిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. ఈ సినిమాని చివరి వరకు ఎంజాయ్ చేసాను. దర్శకుడు రామ్ అబ్బరాజు చక్కగా వ్రాసి, చక్కగా సినిమాను తెరకెక్కించారు, ఇక శ్రీవిష్ణు ఈ సినిమాను బాగా ముందుకు తీసుకు వెళ్లారు. అతనికి హిట్ పడడం నాకు నిజంగా సంతోషం. నటుడు నరేష్, వెన్నెల కిషోర్, నా మలయాళీ రెబా మోనికా జాన్ మరియు ఇతర నటీనటులకు నా రెస్పెక్ట్ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక సాంకేతిక నిపుణులు, నిర్మాతకు చాలా గౌరవం అని ఆయన పేర్కొంటూనే ఈ సినిమా 100% తెలుగు వినోదం అందిస్తుందని రాసుకొచ్చారు.

Show comments