Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం బన్నీ-అట్లీ చాలానే రీసెర్చ్ చేస్తున్నారంట. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంటున్నారంట. ఇప్పటికే యూఎస్ కు వెళ్లిన అట్లీ.. అక్కడ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన కొందరు యాక్షన్ సీన్స్ మేకర్స్ ను కలిసినట్టు తెలుస్తోంది. తమ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లనే తీసుకుంటున్నాడంట. అయితే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల గురించి చర్చించేందుకు అట్లీ తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కలిసినట్టు తెలుస్తోంది.
Read Also : Bhatti Vikramarka : బ్యాంకర్లు ఆర్థికసాయం చేస్తే.. సమాజానికి మరింత ఉపయోగం
ఈ మూవీలో అల్లు అర్జున్ త్రిబుల్ రోల్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి యానిమేటెడ్ రోల్ అని ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దాని కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారంట. ఇందులో యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
యాక్షన్, ఎమోషన్ కలగలిపిన డ్రామా అని సమాచారం. ఇందులో భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నారు. దానికోసం హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ ఎక్స్ కంపెనీలు వీరితో జతకట్టాయి. ఇందులో చూపించే ప్రతి సీన్ మరో ప్రపంచంలో ఉన్నట్టే ఉంటుందని చెబుతున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ దాదాపు రూ.700 కోట్లతో నిర్మిస్తోంది.
Read Also : Deepika: స్పిరిట్ లో అవుట్.. బన్నీ సినిమాలో ఇన్?
