AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?

Tollywood

Tollywood

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో AA23 రాబోతున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ సడెన్‌గా ఆగిపోయిందంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

స్క్రిప్ట్ విషయంలో, షూటింగ్ విషయంలో అల్లు అర్జున్ నుంచి క్లారిటీ రాకపోవడంతో ప్రస్తుతం లోకేష్ మరో హీరో వైపు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  దీంతో బన్నీ అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది. మరోవైపు బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ రాకా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ పనులకే ఎక్కువ సమయం పడుతుండటంతో, లోకేష్ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి అనుకున్న సమయం కంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు రాకాను రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే AA 23 ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు హీరో అల్లు అర్జున్ కానీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కానీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అఫీషియల్ ప్రకటన వస్తేగాని ఈ సినిమాకు సంబంధించి రూమర్స్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.