NTV Telugu Site icon

Allu Arjun: పవన్ డైరెక్టర్ తో బన్నీ బాలీవుడ్ సినిమా.. అంత లేదమ్మా.. ఇది మ్యాటర్

Allu Arjun

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ ఏడాది జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో బన్నీ లైనప్ మరింత పెరిగింది ఇప్పటికే పుష్ప 2 ను ఫినిష్ చేసే పనిలో ఉన్న బన్నీ.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు. దాని తరువాత సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమా ఉంటుందని టాక్ .. ఇక ఇవన్నీ కాకుండా ఇంకోపక్క యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక మహేష్ బాబు తరువాత అల్లు అర్జున్ మాత్రమే ఎక్కువ యాడ్స్ చేస్తున్నాడు. ఆయన చేతిలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక మొదటి నుంచి రెడ్ బస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక రెండు రోజులుగా ఒక బాలీవుడ్ మూవీలో బన్నీ నటిస్తున్నాడని, దానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వినిపించాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.

Sapta Sagaralu Dhaati: రిలీజ్ అయ్యి వారం కూడా కాలేదు కదా అన్నా.. అప్పుడే ఓటిటీనా.. ?

అయితే అస్సలు విషయం ఏంటంటే.. రెడ్ బస్ కోసం అల్లు అర్జున్- క్రిష్ జాగర్లమూడి కలిసి పనిచేశారు. ఇందుకు సంబంధించిన యాడ్ నేడు రిలీజ్ అయ్యింది. రెడ్ బస్ కోసం క్రిష్ .. రెండు రకాల యాడ్స్ లో నటించాడు. ఇందులో అల్లు అర్జున్ ఎప్పటిలానే స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ యాడ్స్ రెండు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం క్రిష్.. పవన్ తో హరిహరవీరమల్లు తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అందుకుంటే .. అల్లు అర్జున్ తో ఒక సినిమా తీసే అవకాశముండేమో చూడాలి.

Show comments