Site icon NTV Telugu

తలైవా కంటే ఎక్కువ ఫాలోయింగ్… సౌత్ లో అత్యధికంగా ఫాలో అవుతున్న స్టార్

Allu Arjun

సాధారణంగా సౌత్ లో తలైవా రజినీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను మరో స్టార్ హీరో దక్కించుకున్నాడు. తలైవాను మించిన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తాను మాత్రం ఎవ్వరినీ ఫాలో అవ్వడం లేదు. ‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి సందడి చేసింది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా దుమ్మురేపింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ పాపులారిటీ కూడా భారీగా పెరిగిపోయింది.

Read Also : ‘పుష్ప’ స్టైల్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్… కానీ ఫ్లవర్ అయ్యాడుగా !

అల్లు అర్జున్ ఇప్పుడు రజనీకాంత్‌ను అధిగమించి ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ స్టార్‌గా మారాడు. అల్లు అర్జున్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 6.5 మిలియన్లకు చేచేరుకుంది. ఈ జాబితాలో రజినీకాంత్ 6.1 మిలియన్ల మంది ఫాలోవర్లను, ఆపై 1.2 మిలియన్లతో చిరంజీవిని ఫాలో అవుతున్నారు. అయితే పుష్ప స్టార్ అల్లు మాత్రం ఎవరినీ ఫాలో అవ్వకపోవడం గమనార్హం.

ఇక ‘పుష్ప: ది రూల్’ను ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మికలతో పాటు ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్నారు. డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ‘పుష్ప : ది రైజ్’ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Exit mobile version