Allu Arjun Friend Nandyala Shilpa Ravi Chandra Reddy lost in Elections:2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగినంత ఆసక్తికరంగా మునుపెన్నడు ఎన్నికలు జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దె దించేలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసింది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన కుటుంబ సభ్యులు మెగా హీరోలు పిఠాపురంలో మాత్రమే కాదు మరికొన్ని చోట్ల కూడా ప్రచారానికి వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తాడనుకున్న అల్లు అర్జున్ మాత్రం ఆయన కోసం కేవలం సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. మరో పక్క నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తనకు స్నేహితుడని తన భార్య రవిచంద్ర రెడ్డి భార్య కలిసి చదువుకున్నారు కాబట్టి తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
Chiranjeevi: డియర్ కళ్యాణ్ బాబు హృదయం ఉప్పొంగుతోంది.. చిరు ఎమోషనల్ ట్వీట్
ఎన్నికలకు గంటల వ్యవధి ఉండగా నంద్యాల వెళ్లడమే కాదు పెద్ద ఎత్తున బల ప్రదర్శన కూడా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రవిచంద్ర రెడ్డి సహా అల్లు అర్జున్ మీద కేసులు కూడా నమోదు అయ్యాయి. తీరా ఇంత చేస్తే రవిచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫరూక్ చేతిలో ఓటమిపాలయ్యారు.. దాదాపుగా ఫరూక్ శిల్పా రవిచంద్ర రెడ్డి మీద 12 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. దీంతో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లిమా ఉపయోగం లేకుండా పోయింది అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోపక్క నంద్యాల పార్లమెంటు స్థానాన్ని కూడా బైరెడ్డి శబరి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె. తొలుత బిజెపిలో ఉన్న ఆమె ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు.