ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటిసారి ఎమోషనల్ అయ్యాడు. మునుపెన్నడూ లేనివిధంగా స్టేజిపైనే ఏడ్చేశాడు. పుష్ప థాంక్యూ మీట్ లో ఈ ఘటన జరిగింది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన పుష్ప ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంది . అల్లు అర్జున్ కెరీర్ లోయ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప విజయోత్సవ వేడుకలను అల్లుఅర్జున్ ఘనంగా ప్లాన్ చేసాడు. నేడు పుష్ప థాంక్స్ మీట్ పెట్టి చిత్ర యూనిట్ అందరికి థాంక్స్ చెప్పాడు.
ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ అందరికి థాంక్స్ చెప్పారు. ప్రతిసారి అందరికి థాంక్స్ చెప్పడం అలవాటే అని అందరు అనుకుంటారు. కానీ అది మీకు అవసరం లేకపోయినా మాకు అవసరం అని చెప్పుకొచ్చాడు. రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక నా మనసుకు బాగా కనెక్ట్ అయిన అతి తక్కువ మందిలో ఒకరు.. కొన్ని సీన్స్ లో ఆమె సహకారం లేకపోతె నేను కంపార్ట్ గా చేయలేకపోయేవాడిని.. థాంక్స్ రష్మిక అని చెప్పుకొచ్చారు. ఇక సమంత గురించి మాట్లాడుతూ సామ్ నన్ను నమ్మి ఈ సాంగ్ చేసినందుకు థాంక్స్.. ఇక చివరగా సుకుమార్ గురించి మట్లాడుతూ బన్నీ ఎమోషనల్ అయ్యాడు.
ఆర్య నుంచి పుష్ప వరకు వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని గుర్తుచేసుకొని కంటతడి పెట్టుకున్నాడు. “నా జీవితంలో నేను రుణపడి ఉన్నాను అనే మాట కొంతమందికే వాడుతుంటాను.. నా తల్లిదండ్రులకు వాడతాను.. మా తాతగారికి.. నా కెరీర్ మొదటి నుంచి నన్ను సపోర్ట్ చచేస్తున్న చిరంజీవి గారికి.. ఆ తరువాత సుకుమార్ గారికి.. నాకు తెలియదు సుకుమార్ అంటే అంత ఇష్టమని.. ఆర్య’ సినిమా చేసిన కొన్నాళ్లకి నేను ఒక కారు కొనుక్కున్నాను. దాని ఖరీదు 85 లక్షలు .. అద్దిరిపోయే స్పోర్ట్స్ కారు అది. ఆ కారు ఎక్కిన తరువాత నేను స్టీరింగ్ పై చేయిపెట్టి నేను ఇంత దూరం రావడానికి కారకులు ఎవరు అని ఆలోచించాను. అప్పుడు నా మనసులో మెదిలిన ఒకే ఒక వ్యక్తి సుకుమార్ గారు. డాళింగ్ నువ్వు లేకపోతే నేను లేను.. ఆర్య లేదు.. ఇంకేమి లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక బన్నీ మాటలకు సుకుమార్ సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం బన్నీ ఎమోషనల్ అయినా వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
