NTV Telugu Site icon

Allu Arjun:’ప్రభాస్’ దెబ్బకు అలెర్ట్ అయిన ‘బన్నీ’..రిజెక్ట్ చేసేసినట్టే?

Allu Arjun

Allu Arjun

Allu Arjun Denied Immortal Ashwatthama: ప్రభాస్ వల్ల అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాడా? అంటే, ఔననే అంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాల వారు. అసలు ప్రభాస్ వల్ల బన్నీ రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అంటే.. దానికి సాలిడ్ రీజన్ కూడా ఒకటి ఉందని అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు కానీ ప్రభాస్ నమ్మకాన్ని ఏమాత్రం నిలబెట్టలేకపోయాడు. కలెక్షన్స్‌ మాత్రం లేవు కానీ లెక్కకు మిక్కిలి కాంట్రవర్శీలు మాత్రం తెర మీదకు వచ్చాయి. దీని వల్ల ప్రభాస్ ఇక పై బాలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కమిట్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ కూడా ఈ రీజన్ వల్ల క్యాన్సిల్ అయినట్టు టాక్. ఈ బాటలోనే నడుస్తూ బన్నీ కూడా బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రజెంట్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు.

Local Boi Nani: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న యూట్యూబర్ లోకల్ బాయ్ నాని.. దెబ్బకి దశ తిరిగుండేది!

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌, సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయబోతున్నాడు. అయితే బాలీవుడ్ మేకర్స్ కూడా బన్నీతో సినిమాలు చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో బన్నీతో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్‌ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తే నో చెప్పినట్టు సమాచారం. ‘ఉరి’ తర్వాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ‘అమర్‌ అశ్వథ్థామ’ అనే భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో హీరో ఫైనల్ అవడం లేదు. ముందుగా విక్కీ కౌశల్‌ అనుకున్నారు ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్‌ అన్నారు.. చివరగా ఈ ఆఫర్ బన్నీ దగ్గరికి వచ్చినట్టు వార్తలొచ్చాయి. కానీ ఆదిపురుష్ రిజల్ట్ వల్ల బాలీవుడ్ మేకర్స్‌తో సినిమాలు చేయడానికి వెనకడుగు వేశాడట బన్నీ. పైగా ‘అమర్‌ అశ్వథ్థామ’ ప్రాజెక్ట్ కూడా గ్రాఫిక్స్‌ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, అందుకే బన్నీ ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడనే న్యూస్ వైరల్‌ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. మన స్టార్ హీరోలు మాత్రం బాలీవుడ్ మేకర్స్‌ విషయంలో జాగ్రత్త పడుతున్నారనే చెప్పాలి.

Show comments