Site icon NTV Telugu

Allu Arjun : అల్లు అర్జున్ సంచలన రికార్డు.. టాలీవుడ్ లో తొలి హీరో

Allu Arjun

Allu Arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా అవార్డులు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయనకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. గతంలోనూ అల్లు అర్జున్ సైమా అవార్డులు అందుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలా వైకుంఠపురంలో (2021), పుష్ప (2022) సినిమాల్లో అవార్డులు అందుకున్నాడు. ఈ తరం హీరోల్లో ఎక్కువగా టాలీవుడ్ నుంచి సైమా అవార్డులు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు.

Read Also : Mirai : మిరాయ్ గురించి సీక్రెట్ చెప్పిన మంచు మనోజ్..

రీసెంట్ గానే తెలంగాణ ప్రభుత్వం అందజేసిన గద్దర్ అవార్డుల వేడుకలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా తొలి గద్దర్ అవార్డు అందుకున్న హీరోగా నిలిచిపోయాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటన పరంగా ఎక్కువగా అవార్డులు అందుకుంటూ వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. ఒకప్పుడు వీడు హీరో ఏంట్రా అనుకున్న వారితోనే ఇప్పుడు హీరో అంటే ఇతనే అనేలా చేసుకుంటున్నాడు మన ఐకాన్ స్టార్. ప్రతి సినిమాలో నటన పరంగా వేరియేషన్స్ చూపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అట్లీతో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అది భారీ వీఎఫ్ ఎక్స్ ఆధారిత సినిమాగా రాబోతోంది. ఇందులో దీపిక పదుకొణె హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ మూవీ. మరి ఆ సినిమాతో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Read Also : Mirai : మిరాయ్ లో అదే హైలెట్ సీన్ : మంచు మనోజ్

Exit mobile version