Mirai : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఆయన నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. బ్లాక్ స్క్వార్డ్ అనే మోడ్రన్ రావణాసురిడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయని ఇప్పటికే వచ్చిన ట్రైలర్ చెబుతోంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీవీతో స్పెషల్ గా మాట్లాడారు మనోజ్. మిరాయ్ అంటే ఏంటో ఆయన వివరించారు. మిరాయ్ అంటే జపాన్ లో ఫ్యూచర్ లేదా హోప్ అని అర్థం. ఈ సినిమా కథ పూర్తిగా రేపటి కోసం జరిగే యుద్ధంలా కనిపిస్తుంది అంటూ తెలిపాడు మనోజ్. ఈ మధ్య నెగెటివ్ రోల్స్ ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి అసలు కారణం కూడా తెలిపాడు.
Read Also : Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అప్పుడేనట..
భైరవం సినిమాలో నా పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్నది కాదు. కానీ మిరాయ్ సినిమాలో చేసిన పాత్ర మాత్రం పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్నదే. ఇందులో పురాణాలను డైరెక్టర్ కార్తీక్ చూపించారు. తొమ్మిది గ్రంథాలు బ్లాక్ స్క్వార్డ్ కు దొరికితే అతను రావణాసురిడిగా మారిపోతాడు. అప్పుడు అతన్ని చంపడానికి రాముడే దిగి రావాలి. అందుకే ఈ సినిమా కథలో మిరాయ్ అనే స్టిక్ ను బేస్ చేసుకుని సీన్లు తీశాం. ఆ స్టిక్ చుట్టూ కథ తిరుగుతుంది. బ్లాక్ స్క్వార్డ్ ను అడ్డుకునే శక్తి దానికి మాత్రమే ఉంటుంది. ఆ స్టిక్ పేరు మిరాయ్. ఆ స్టిక్ ను బేస్ చేసుకుని కథ తిరుగుతుంది అని తెలిపాడు మనోజ్. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మిరాయ్ ఉ ఉన్న శక్తులు ఈ సినిమాలో చూస్తారు అంటూ తెలిపాడు మనోజ్. దీంతో అతను చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ స్టిక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మిరాయ్ సినిమాలో తేజసజ్జ, మనోజ్ చేసే యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతాయని తెలుస్తోంది.
Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్ సంచలన రికార్డు.. ఈ ఏడాది ఇదే మొదటిసారి..