Dasara: పుష్పరాజ్ మెచ్చిన ధరణి కథ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నానిని మాస్ అవతారంలో ప్రెజెంట్ చేసిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 115 కోట్లని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దసరా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. శాకుంతలం, రావణాసుర సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో మూడో వారంలో కూడా దసరా సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో దసరా సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది. మరో వారం రోజుల పాటు దసరా సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది. తెలంగాణాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా దసరా సినిమా భారి కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇప్పటికే 2 మిలియన్ క్రాస్ చేసిన దసరా సినిమా ఓవరాల్ రన్ లో 2.5 మిలియన్ డాలర్స్ వరకూ రాబట్టే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్ తో కాంప్లిమెంట్స్ కి కూడా రాబడుతోంది దసరా సినిమా. ధరణిగా నాని పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ఆడియన్స్ ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టాయి.
ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ బ్లాక్స్ లో కూడా నాని అద్భుతంగా నటించాడు. సింపుల్ చెప్పాలి అంటే దసరా నానిని ఇండస్ట్రీలోకి మాస్ హీరోగా రీఇంట్రడ్యూస్ చేసింది. ఇక నానిని కాంపెన్సేట్ చేస్తూ వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. ఈ ఇద్దరి మధ్య సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. కొత్త దర్శకుడు అయినా శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాని తెరకెక్కించిన విధానమే కీర్తి సురేష్, నానిలకి అంత పేరు తెచ్చిందనే చెప్పాలి. ఆడియన్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకూ ప్రతి ఒక్కరి నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటున్న దసరా సినిమాకి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. నాని, కీర్తి సురేష్, సంతోష్ నారాయణ్, శ్రీకాంత్ ఓదెల, డీఓపీ సత్యన్… కాస్ట్ అండ్ క్రూ అందరినీ ట్యాగ్ చేసి “బిగ్ కాంగ్రాచులేషన్స్” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. బన్నీ నుంచి వచ్చిన ట్వీట్ కి నాని, థాంక్స్ చెప్తూ పుష్ప 2 కోసం అందరిలానే తానూ వెయిట్ చేస్తున్నాను అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం నాని ఫాన్స్ బన్నీ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.
Also Read
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
Big Congratulations to the entire team of #Dasara . Brilliantly made film . Finest performance my brother @NameisNani . Candid performances by @KeerthyOfficial and all the other cast . Wonderful songs & B.Score by @Music_Santhosh garu & excellent camera work by Sathyan garu . The…
— Allu Arjun (@alluarjun) April 17, 2023
Thank you @alluarjun ♥️ waiting for #Pushpa2 along with the rest of the country https://t.co/Rm7lgOrBlY
— Nani (@NameisNani) April 17, 2023
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!