Site icon NTV Telugu

Dasara: పుష్పరాజ్ మెచ్చిన ధరణి కథ…

Dasara

Dasara

నేచురల్ స్టార్ నానిని మాస్ అవతారంలో ప్రెజెంట్ చేసిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 115 కోట్లని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దసరా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. శాకుంతలం, రావణాసుర సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో మూడో వారంలో కూడా దసరా సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో దసరా సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది. మరో వారం రోజుల పాటు దసరా సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉంది. తెలంగాణాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా దసరా సినిమా భారి కలెక్షన్స్ ని రాబడుతోంది. ఇప్పటికే 2 మిలియన్ క్రాస్ చేసిన దసరా సినిమా ఓవరాల్ రన్ లో 2.5 మిలియన్ డాలర్స్ వరకూ రాబట్టే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్ తో కాంప్లిమెంట్స్ కి కూడా రాబడుతోంది దసరా సినిమా. ధరణిగా నాని పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ఆడియన్స్ ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టాయి.

ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ బ్లాక్స్ లో కూడా నాని అద్భుతంగా నటించాడు. సింపుల్ చెప్పాలి అంటే దసరా నానిని ఇండస్ట్రీలోకి మాస్ హీరోగా రీఇంట్రడ్యూస్ చేసింది. ఇక నానిని కాంపెన్సేట్ చేస్తూ  వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. ఈ ఇద్దరి మధ్య సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. కొత్త దర్శకుడు అయినా శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాని తెరకెక్కించిన విధానమే కీర్తి సురేష్, నానిలకి అంత పేరు తెచ్చిందనే చెప్పాలి. ఆడియన్స్ నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకూ ప్రతి ఒక్కరి నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటున్న దసరా సినిమాకి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయాడు. నాని, కీర్తి సురేష్, సంతోష్ నారాయణ్, శ్రీకాంత్ ఓదెల, డీఓపీ సత్యన్… కాస్ట్ అండ్ క్రూ అందరినీ ట్యాగ్ చేసి “బిగ్ కాంగ్రాచులేషన్స్” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. బన్నీ నుంచి వచ్చిన ట్వీట్ కి నాని, థాంక్స్ చెప్తూ పుష్ప 2 కోసం అందరిలానే తానూ వెయిట్ చేస్తున్నాను అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం నాని ఫాన్స్ బన్నీ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

Exit mobile version