మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మెగా ఫ్యాన్స్ కూడా సెపరేట్ అవుతున్నారు, అల్లు అర్జున్ కి మిగిలిన మెగా హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. అల్లు అర్జున్ చేసిన తప్పుని తను చెయ్యకుండా, విమర్శలు చేసే వాళ్లకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెగాస్టార్ చిరంజీవి, బన్నీ పుట్టిన రోజున బన్నీకి బర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. యంగ్ హీరోల మధ్య ఎన్ని డిఫరెన్స్ లు ఉన్నా తనకి మాత్రం మెగా హీరోలంతా సమానమే, ఎవరి పట్ల పక్షపాతం లేదు అనేలా చిరు ట్వీట్ చేశాడు.
బర్త్ డే విశేష్ తో పాటు పుష్ప ది రూల్ ఫస్ట్ లుక్ కూడా రాకింగ్ గా ఉంది అంటూ చిరు కాంప్లిమెంట్స్ అందించాడు. అల్లు అర్జున్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ చిరు చేసిన ఒక్క ట్వీట్ మెగా-అల్లు అభిమానుల మధ్య ఉన్న దూరాన్ని కాస్త తగ్గించింది. ఇప్పుడు చిరు బర్త్ డే రోజున అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేసి విమర్శలకి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేసాడు. “Many many happy returns of the day to our beloved one & only mega star @KChiruTweets garu #happybirthdaymegastarchiranjeevi ” అంటూ బన్నీ ట్వీట్ చేసాడు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అని అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్ ని రీట్వీట్స్ కొడుతూ ఫాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు.
Many many happy returns of the day to our beloved one & only mega star @KChiruTweets garu.#HBDMegastarChiranjeevi
— Allu Arjun (@alluarjun) August 22, 2023