Site icon NTV Telugu

Icon Star: స్నేహారెడ్డి బ్తర్ డే… గోల్డెన్ టెంపుల్ లో బన్నీ ఫ్యామిలీ!

Bunny

Bunny

Icon Star: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భార్య స్నేహారెడ్డి అంటే ఎంతో ప్రేమ. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్న బన్నీ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. అలానే స్నేహారెడ్డితో పాటు పిల్లలను తీసుకుని అవుటింగ్ కూ వెళుతుంటాడు. ఈ రోజు స్నేహారెడ్డి బర్త్ డే ను పురస్కరించుకుని బన్నీ అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని సందర్భించుకున్నారు. తన కూతురు వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అల్లు అర్జున్, ఇవాళ తన సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా సాధారణ వ్యక్తిలా గోల్డెన్ టెంపుల్ ను సందర్శించడం విశేషం.

చిరు చేతుల మీదగా…
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ని మెగాస్టార్ చిరంజీవి అక్టోబర్ 1న ప్రారంభించబోతున్నారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులను గత యేడాది అల్లు రామలింగయ్య జయంతి రోజునే ప్రారంభించారు. ఇటీవలే ఈ స్టూడియో నిర్మాణ పని పూర్తయింది. ఇందులో సినిమా చిత్రీకరణ పనులకు సంబంధించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అల్లు అరవింద్ ఆయన తనయులు వెంకటేశ్ (బాబీ), అర్జున్, శిరీశ్ ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే… అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప -2’ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజున స్టూడియోలో మొదలవుతుందని తెలుస్తోంది.

Exit mobile version