హీరో శ్రీవిష్ణు సినిమాల ఎలా ఉన్నప్పటికీ భిన్నమైన కథాంశాలతో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా తను ప్రదీప్ వర్మను దర్శకుడుగా పరిచయం చేస్తూ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అల్లూరి’ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ నెల 23న విడుదలకు సిద్ధం అయింది. ఇక ఈ నెల 18న నిర్వహించనున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడట.
థియేట్రికల్ ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలో నిజాయితీ, నిబద్ధత కలిగిన పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు శ్రీవిష్ణు. ఓ పోలీసు ఆఫీసర్ జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రచారంలో భాగంగా పలు సెంటర్లలో పోలీస్ ఆఫీసర్స్ ను కలసి వచ్చాడు శ్రీవిష్ణు. అల్లూరి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. మరి బన్నీ రాకతో శ్రీవిష్ణుకి అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కుతాయేమో చూడాలి.