అల్లు అర్జున్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాడు. అయినా ఇప్పటి వరకూ తన నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తనతో సినిమాలు తీయటానికి దర్శకులు స్క్రిప్ట్ లతో రెడీగా ఉన్నారు. నిజానికి ‘పుష్ప2’ షూటింగ్ కి వెళ్ళబోయే ముందు మరో సినిమా చేయాలని భావించాడు బన్నీ. కానీ ‘పుష్ప’ ఘన విజయం తన ప్లాన్స్ ని మార్చివేసింది. బోయపాటి శ్రీను, కొరటాల శివ, లింగుస్వామి వంటి దర్శకులు తన లైనప్ లో ఉన్నారు. ఇప్పుడు వారి సినిమాలు అన్నీ ‘పుష్ప2’ తర్వాతే. ఈ సీక్వెల్‌తో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలనే ధ్యేయంతో ఉన్నాడు అల్లు అర్జున్. అందుకే బన్నీతో పాటు దర్శకుడు సుకుమార్ వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళే ముందే ‘పుష్ప 2’ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Read Also : ‘రాధే శ్యామ్’కి బాట్‌మ్యాన్ దెబ్బ!?
అంతే కాదు ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేసుకున్నారట. పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న విడుదలైంది. ఇప్పుడు రెండవ భాగం ‘పుష్ప: ది రూల్’ని కూడా డిసెంబర్ 17న విడుదల చేయాలని సంకల్పించారట. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కి దాదాపు 9 నెలల టైమ్ ఉంది. బన్నీ కంటిన్యుటీ కోసమే గడ్డాన్ని అలాగే ఉంచాడట. ‘పుష్ప’ ద రైజ్’ విడుదలను హడావుడిగా చేయటంతో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. రెండో భాగాన్ని అలా కాకుండా పక్కా ప్లాన్ తో భారీ ప్రచారం చేసి మరీ విడుదల చేసేలా ప్లాన్ చేయనున్నారు. తొలి భాగాన్ని మించి సక్సెస్ చేయలాన్నదే సుకుమార్, బన్నీ ముందు ఉన్న లక్ష్యం. సో బెస్టాప్ లక్ చెబుదామా!?