Site icon NTV Telugu

బన్నీ, బోయపాటి కలయికలో రెండో సినిమా

Allu Arjun and Boyapti ready to their second project

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాల రూపకల్పనకు పెట్టింది పేరైన బోయపాటితో బన్నీ సినిమా కమిట్ అయ్యాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Read Also : మరోసారి ప్రభాస్, రాజమౌళి సినిమా

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్యాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మించే ‘ఐకాన్’ షూట్‌లో పాల్గొంటాడు. ఆ సినిమా దాదాపు పూర్తి చేసి… ఆ తర్వాత బోయపాటి షూటింగ్ ప్రారంభిస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందట. బోయపాటి నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ చిత్రం చేస్తున్నాడు, ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక కాగా శ్రీకాంత్ విలన్.

Exit mobile version