మరోసారి ప్రభాస్, రాజమౌళి సినిమా

టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్‌ అంటే రాజమౌళి, ప్రభాస్ దే. ఇప్పటికే వీరి కలయికలో ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సీరీస్ వచ్చి ఘన విజయం సాధించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చాలా సంవత్సరాల క్రితమే భారీ అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ బ్లాక్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు రాజమౌళితో టాక్స్ జరుగున్నాయట. అనుకున్న విధంగా జరిగితే త్వరలోనే ఈ రేర్ కాంబినేషన్ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుంది.

Read Also : ‘స్వాతిముత్యం’ గా బెల్లంకొండ గణేష్

రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ‘ఆర్ఆర్ఆర్’ తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మహేష్ బాబు సినిమా చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉండవచ్చని అంటున్నారు. ఇక ప్రభాస్ వరుస చిత్రాలలో యమ బిజీగా ఉన్నాడు. అవన్నీ వేర్వేరు నిర్మాణ దశలలో ఉన్నాయి. ముందుగా వచ్చే సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ విడుదల కానుంది. ఆ తర్వాత ఓం రౌత్ తో ‘ఆది పురుష్‌’, ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు చేయనున్నాడు. ఆ ప్రాజెక్ట్ లు పూర్తి అయిన తర్వాత రాజమౌళితో సినిమా ఉండవచ్చిన ప్రస్తుతానికి వినిపిస్తున్న టాక్. చూడాలి ఏం జరుగుతుందో!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-