టాలివుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ సాధించాడు.. ఈ సంతోషాన్ని తన కుటుంబంతో కలిసి పంచుకున్నాడు.. ఈ విషయాన్ని పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన ఇంటికి వచ్చి మరీ చెప్పగా బన్నీ నిజమా నేను నమ్మలేకున్నా అని ఎమోషనల్ అయ్యాడు.. అంతేకాదు కాసేపు ఆ విషయాన్ని నమ్మలేక పోయాడు.. బన్నీ తనను తాను నమ్మలేకపోయాడు. సంతోషంతో బన్నీ కళ్లు చెమ్మగిల్లాయి. తన భార్య స్నేహారెడ్డిని పట్టుకుని ఏడ్చేశాడు, అందరి ముందే ముద్దు పెట్టుకున్నాడు బన్నీ. తన పిల్లలనుదగ్గరకు తీసుకుని ముద్దాడాడు. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
అంతే కాదు తన తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తండ్రిని ముద్దాడి తన సంతోషాన్ని వెల్లడించాడు. ఈసందర్భంగా పుష్పాటీమ్ బన్నీని విష్ చేశారు. ఈక్రమంలో డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ను పట్టుకుని ఏడ్చేశాడు. పుష్ప సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.. చిత్ర టీమ్ తో కలిసి ఈ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ..
ఈ సినిమాలో గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించాడు..చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు. ఊరమాస్ డైలాగ్ డెలివరీ మాత్రం కాదు బన్నీ బాడీ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా పెర్ఫాన్స్ తో కేక పెట్టించాడు. బన్నీ ఉత్తమ నటుడిగా గెలవడంతో ఫ్యాన్స్, టాలీవుడ్ సెలెబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 లో నటిస్తున్నాడు..