NTV Telugu Site icon

Allu Arha: అల్లు అర్జున్ కూతురా..? మజాకానా..? అట్లుంటుంది అర్హతో..

Arha

Arha

Allu Arha: ఇత్తు ఒకటి అయితే చెట్టు ఒక్కటి అవుతుందా..? అనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం అల్లు అర్హ విషయంలో ఈ సామెత నిజమైంది. తండ్రి నటన ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా అల్లు అర్జున్ దిగనంతవరకే.. ఒక్కసారి అందులోకి దిగాడా..? బన్నీని మించి ఇంకెవరు అలా చేయలేరు అనేలా చేస్తాడు. అందుకు పుష్పనే నిదర్శనం. ఇక అలాంటి తండ్రికి పుట్టిన ఈ చిన్నారి.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసిందట. అల్లు అర్హ .. సమంత నటించిన శాకుంతలం సినిమాతో గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ చిన్నది పుట్టినప్పటినుంచే సోషల్ మీడియాలో స్టార్. తండ్రితో ముద్దు ముద్దుగా వీడియోల్లో కనిపించి ఔరా అనిపించింది. ఇక ఈ గడసరి ఆరేళ్ళ వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. శాకుంతలం సినిమాలో ప్రిన్స్ భరతుడుగా నటించింది.

Vetrimaaran: ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్.. రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..?

ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో అర్హ సీన్స్ ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్లు వేశారు. అవి చూసిన వారినుంచి వచ్చే మాట.. అల్లు అర్హ నటన అద్భుతం. ఈ వయస్సులోనే ఆమె ఇంత గొప్పగా నటిస్తుందని అనుకోలేదు అని చెప్పుకొస్తున్నారు. చివర్లో అర్హ స్సన్నివేశాలే సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయట. చిన్నపిల్లల కాకుండా ఒక మ్యాచుర్డ్ నటనతో ఆకట్టుకుందని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మాటలు వింటుంటే.. అర్హ ముందు ముందు పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి.. అల్లు అర్జున్ కూతురా..? మజాకానా..? అట్లుంటుంది అర్హతో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్టుల కొరత టాలీవుడ్ కు ఉందని చెప్పొచ్చు. ఒకవేళ బన్నీ ఒప్పుకొంటే.. అర్హ ఆ కొరతను తీర్చేస్తుందని అంటున్నారు.