Allu Arha: ఒకరు పోషించిన పాత్రను మరొకరు పోషించడం అన్నది కొత్తేమీ కాదు. ఇప్పుడు సమంత నాయికగా గుణశేఖర్ రూపొందించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో గతంలో రూపొందిన ‘శకుంతల’ చిత్రాల్లోని నటీనటులతో ఈ సినిమాలో నటించిన వారిని పోలుస్తున్నారు. అదేమీ వింత కాదు. కానీ, జూనియర్ యన్టీఆర్ గతంలో పోషించిన పాత్రను అల్లు అర్జున్ కూతురు అర్హ ‘శాకుంతలం’లో నటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Agent: ఓరినీ.. ‘ఏజెంట్’ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. భలే ట్విస్ట్ ఇచ్చారే
ఇంతకూ ‘శాకుంతలం’లో అల్లు అర్జున్ కూతురు అర్హ పోషించిన పాత్ర ఏంటి? బాల భరతుడు. శకుంతల, దుష్యంతునికి జన్మించిన కుమారుడు భరతుడు. అతని పేరనే మన భారతదేశం ఖ్యాతినొందిందని అంటారు. బాల భరతుని పాత్రను ఇప్పుడు అల్లు అర్హ పోషించింది. ఇదే పాత్రను గతంలో అంటే 1991లో యంగ్ టైగర్ యన్టీఆర్ తన 8వ ఏట తాత నటరత్న యన్టీఆర్ డైరెక్షన్ లో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షన్ కోసం ధరించారు. అదే జూనియర్ యన్టీఆర్ తెరపై కనిపించిన తొలి చిత్రం. ఈ హిందీ చిత్రం ఉత్తరాదిన మాత్రమే విడుదలయింది. అప్పటికే తెలుగు వర్షన్ రిలీజయి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో జూనియర్ 8 ఏళ్ళ వయసులో పోషించిన పాత్రను, ‘శాకుంతలం’లో అల్లు అర్జున్ కూతురు అర్హ 6 ఏళ్ళ వయసులోనే ధరించిందని సినీజనం చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 14న జనం ముందుకు వస్తోన్న ‘శాకుంతలం’లో అర్హ ఏ తీరున ఆకట్టుకుంటుందో చూడాలి.