టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అల్లు అర్జున్ తండ్రిగా, గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ గా విజయవంతమైన బిజినెస్ మ్యాన్ గా టాలీవుడ్ లో ఆయనకొక గుర్తింపు ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ ఇటీవల ‘గని’ చిత్రంతో నష్టాలను చవిచూసిన విషయం విదితమే. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అల్లు అరవింద్ ఇండస్ట్రీపై సంచలనం వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివాదాలు హీరో విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే.దీంతో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటుచేసింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అరవింద్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినిమా చూసాను.. చాలా బావుంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ ఏమీ అంత బాగాలేదు. గత రెండేళ్లలో ఇండస్ట్రీ చాలా మరిందని ఇండస్ట్రీ వాతావరణం కూడా ఏమంత ఆరోగ్యకరంగా లేదు. రెగ్యులర్ గా సినిమాలు చూసే ప్రేక్షకుల్లోనూ విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఒకప్పుడు విండోల కోసం కుటుంబంతో కలిసి థియేటర్ కు వచ్చి సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఓటీటీలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసే కాలం వచ్చేసింది. అయితే అలాంటివారిని ఈ సినిమా థియేటర్లకు రప్పిస్తోంది ఇలాంటి సమయంలో ఇలాంటి సినిమాలే ఎక్కువగా ఆడాలి. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి అటుఇటు కానీ మద్దెల దరువులా అయిపోయింది. అక్కడ స్టార్స్ నటించిన సినిమాలు కనీసం ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోతుండడం దారుణం. ఈ పరిస్థితి మారాలి. ఈ డేంజర్ ట్రెండ్ నుంచి మనం బయటపడాలి అంటే స్టార్ హీరోలందరూ తమ ఇగోలను పక్కన పెట్టి పనిచేయాలి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.