NTV Telugu Site icon

Allu Aravind: అల్లు అరవింద్ అన్నది మహేష్ బాబు డైరెక్టర్ నేనా..?

Allu

Allu

Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సినిమా అని తెలియడం ఆలస్యం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగువారికి అందించడానికి రెడీ అయిపోతారు. గతంలో కాంతార లాంటి రా అండ్ రస్టిక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించింది అల్లు అరవింద్ యే. ఇక ఇప్పుడు మళయాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 2018 సినిమాను తెలుగు ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ నే అందించింది. ఇక ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకొని భారీ కలక్షన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ థాంక్స్ మీట్ కు కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ మీట్ లో అల్లు అరవింద మాట్లాడిన కొన్ని మాటలు.. డైరెక్టర్ పరుశురామ్ పెట్ల ను ఉద్దేశించే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?

గీతా గోవిందం లాంటి సినిమాను నిర్మించి.. పరుశురామ్ ను స్టార్ డైరెక్టర్ గా చేసింది గీతా ఆర్ట్స్.. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అరవింద్. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చినా పరుశురామ్.. మధ్యలోనే వారిని వదిలేసి.. మరో సినిమాకు సైన్ చేశాడు. ఆ విషయమై అల్లు అరవింద్ ఎప్పుడు మాట్లాడింది లేదు. ఇక తాజాగా ఈ థాంక్స్ మీట్ లో ఇన్ డైరెక్ట్ గా చురకలు వేశాడు.. ” చందు మొండేటి.. కార్తికేయ 2 వచ్చి ఏడాది దాటిపోయింది. కార్తికేయ కన్నా ముందే ఆయనతో రెండు సినిమాలు కమిట్ అయ్యాం. ఈ కారణంగా ఆ తర్వాత అతడికి ఎన్నో ఆఫర్లు వచ్చినా మా గురించి దేన్ని కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికి ఆయన ఆ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నాడు. కానీ, నా ద్వారా పైకి వచ్చిన కొందరు దర్శకులు పేర్లు చెప్పను కానీ.. వాళ్లు గీత దాటి వెళ్లి పని చేసుకున్నారు. కానీ ఈయన నిలబడిపోయి ఉన్నాడు” అని చెప్పుకొచ్చాడు.ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు అది పరుశురామ్ నే అన్నాడు అన్న విషయం తెలియకుండా పోదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే పరుశురామ్.. చివరగా మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి ఈ డ్యామేజ్ వలన ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

Show comments