Site icon NTV Telugu

Allari Naresh: పవర్ ఫుల్ పోలీసోడు వస్తున్నాడు…

Allari Naresh

Allari Naresh

ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘అల్లరి నరేష్’. కెరీర్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ ఉండడంతో అల్లరి నరేష్, ఇక ట్రెండ్ మార్చాల్సిన అవసరం వచ్చింది అని గుర్తించి చేసిన సినిమా ‘నాంది’. ఈ మూవీ అల్లరి నరేష్ లోని కొత్త కోణం బయటకి తీసింది, అతనిలోని సీరియస్ నటుడిని అందరికీ పరిచయం చేసింది. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ‘నాంది’ మూవీతో అల్లరి నరేష్ కెరీర్ కి హ్యుజ్ టర్నింగ్ పాయింట్ దొరికింది. ఇక్కడి నుంచి అల్లరి నరేష్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇటివలే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ఆడియన్స్ ని పలరించిన అల్లరి నరేష్, మరోసారి విజయ్ కనకమేడలతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.

Read Also: Allari Naresh: ‘ఉగ్రం’ తో మరో ‘నాంది’ని చూపించబోతున్నాడా..?

‘ఉగ్రం’ అనే టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీలో అల్లరి నరేష్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఒకప్పుడు కామెడీ పోలిస్ పాత్రలో నటించిన అల్లరి నరేష్, ఇప్పుడు పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. గతంలో ఉగ్రం నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ ని మంచి పేరొచ్చింది. లేటెస్ట్ గా షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఉగ్రం మూవీ టీజర్ ని ఫిబ్రవరి 22 ఉదయం 11:34 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఉగ్రం టీజర్ చాలా బాగా వచ్చిందట. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఉగ్రం సినిమాపై అంచనాలు పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. మరి అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కలిసి ఈసారి ఎలాంటి ఇంటెన్స్ డ్రామాని ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇస్తారో చూడాలి.

Exit mobile version