Allari Naresh: ఆ హీరో కోసం రేటు తగ్గించి మరీ ఓకే చెప్పిన అల్లరోడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allari Naresh: అల్లరి నరేష్.. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న అల్లరిని తొలగించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బతికిఉన్నప్పుడు.. కామెడీ సినిమాలతో హిట్లు అందుకున్న నరేష్.. ఆ తరువాత కామెడీ చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. ఇక దీంతో నరేష్ రూట్ మార్చాడు. కొత్త జనరేషన్ వస్తున్న సమయంలో మనం కూడా మారాలి అనేది తెలుసుకున్న అల్లరోడు.. మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపద్యంలో హీరోగానే కాకుండా సపోర్టివ్ క్యారెక్టర్స్ లో కూడా మెరుస్తున్నాడు. ఇక ఈ మధ్యనే నరేష్ నటించిన ఉగ్రం.. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా ఆడియన్స్ ను మెప్పించాలని నరేష్ డిసైడ్ అయ్యి.. డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎన్నుకుంటున్నాడని టాక్. అందులో భాగంగానే అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా నా సామీ రంగా చిత్రంలో నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో హిట్ అందుకున్న పోరింజు మరియం జోస్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో హీరో కాకుండా మరో పాత్ర చాలా కీలకమట. ఆ పాత్రనే నరేష్ ను ఎంపిక చేసారని తెలుస్తోంది.
Balagam: మరో గ్లోబల్ అవార్డుకు ఎంపికైన బలగం..
Also Read
- Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
- Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
- World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
- Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
ఇక కథ నచ్చడంతో నరేష్ సపోర్టివ్ రోల్ అయినా చేస్తాను అని మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాడు. ఇప్పటికే గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు నాగ్ సినిమాలో కూడా నరేష్ చేయడానికి రెడీ అయ్యాడట. అంతేకాకుండా నాగ్ కోసం తన రెమ్యూనిరేషన్ కూడా తగ్గించి మరీ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథకు నరేష్ పాత్ర చాలా ముఖ్యమట.. అందుకే నరేష్ పారితోషికం గురించి ఆలోచించకుండా కథను నమ్మి ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా తెలపనున్నారు. ఇక ఈ సినిమా కాకుండా ప్రస్తుతం నరేష్ సభకు నమస్కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!