సౌత్ ఇండస్ట్రీలో మాలీవుడ్ సంథింగ్ డిఫరెంట్. కన్విన్సింగ్ కథ, థ్రిల్ చేసే కథనాలతో ఆశ్చర్య పరచడమే కాదు. మల్టీస్టారర్ చిత్రాలతో మంచి హిట్స్ నమోదు చేస్తుంది. గత ఏడాది వచ్చిన లూసిఫర్2, లోక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో చెప్పనక్కర్లేదు. ఈ ఇయర్ కూడా కొన్ని క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు రాబోతున్నాయి. అయితే ఈ ఏడాది మాలీవుడ్‌లో మరికొన్ని క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Also Read : Naari Naari Naduma Murari : బాలయ్య ముహూర్తం.. భారీ పోటీలో బ్లాక్ బస్టర్ కొట్టిన శర్వానంద్
ఐకానిక్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన పేట్రియాట్ ఈ ఏడాదే రిలీజ్ కాబోతుంది. 18 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. మహేష్ నారాయణన్ దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమాకు మరో ఇద్దరు స్టార్ హీరోలు ఫహాద్ ఫజిల్, కుంచికో బొబన్ అదనపు ఆకర్షణ. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా విషు ఫెస్టివల్ సందర్భంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా పేట్రియాట్ గా రాబోతుంది.
Also Read : Asin : గజనీ సినిమా హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా?
ఇక టొవినో థామస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ హీరోలుగా నటిస్తున్న ఫిల్మ్ ‘అతిరథి’. అరుణ్ అనిరుధన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ మూవీ. అలాగే లూసిఫర్2లో నటించిన మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్ మరోసారి ఖలీఫా కోసం కొలబరేట్ కాబోతున్నారు. ఈ సినిమాను టూ పార్ట్స్‌గా తెరకెక్కిస్తున్నారు. ఖలీఫా వన్ ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. ఇలా స్టార్ హీరోలందరూ కలిసి బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
