Jalsa: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రాబోతుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రీట్ రెడీ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 500 షోలు పడనున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే.. ఇటీవలే మహేష్ బాబు బర్త్ డే కానుకగా పోకిరిని రీ రిలీజ్ చేశారు. దాదాపు 400 షోలు పడ్డాయి. ఇక పోకిరి సినిమాకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. థియేటర్లో అభిమానులకు పూనకాలు వచ్చేసాయి. ఇక ఈ ట్రెండ్ ను కొనసాగిస్తూ పవన్ అభిమానులు జల్సా సినిమాను 4 కె ప్రింట్ లో రిలీజ్ చేయాలంటూ మేకర్స్ ను కోరారు. మేకర్స్ సైతం అభిమానుల కోరికను తీర్చబోయే పనిలో ఉన్నట్లు ఇప్పటికే సమాచారం అందుతోంది. ఇక పోకిరి కంటే జల్సాకు ఎక్కువ షోస్ పడనున్నట్లు టాక్ నడుస్తోంది. పోకిరి 400 షోలు పడగా పవన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని జల్సా సినిమాను దాదాపు 500 షోలు వేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే పవన్ అభిమానులకు పూనకాలు వచ్చినట్లే.
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా జల్సా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. వరుస ప్లాపుల నుంచి పవన్ ను త్రివిక్రమ్ ఈ సినిమాతో గట్టెంక్కించాడు. ఇక ఈ చిత్రంలో సంజయ్ సాహూ గా పవన్ మాస్ యాక్టింగ్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కించిందని చెప్పాలి. ముఖ్యంగా పవన్- బ్రహ్మానందం కామెడీకి ఇప్పటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక మరోపక్క ఈ సినిమా రీ రిలీజ్ కారణంగా థియేటర్ ఓనర్స్ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొంటున్నారు. పోకిరి సినిమాకు మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ చేసిన సంగతి తెల్సీడీనే. స్క్రీన్స్ ను చింపేసి, చైర్స్ ను విరగకొట్టి నానా హంగామా చేశారు. ఇక పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో అని థియేటర్ ఓనర్స్ భయపడుతున్నారు. మరి పవన్ బర్త్ డే ఏ రేంజ్ లో చేయనున్నారో చూడాలి.