బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాదిలోనే ఈ ప్రేమ జంట పెళ్లి జరగాల్సి ఉండగా కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యమైంది. ఇక ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమను అధికారికంగా వెల్లడించింది లేదు, పెళ్లి ప్రకటన చేసింది లేదు. అయితే ఒక ఇంటర్వ్యూలో రణబీర్ తన పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడిందని, త్వరలోనే పెళ్లి ఉంటుందని చెప్పడంతో వీళ్ల ప్రేమ అఫీషియల్ అయ్యింది. ఇక ఏ ఇంటర్వ్యూలోనూ రణబీర్ గురించి మాట్లాడని అలియా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి నోరు విప్పింది.
” రణబీర్ తో నా పెళ్లి ఇప్పటికే అయిపోయింది.. నా ప్రేమను అంగీకరించినప్పుడే అతనితో నా మనసులోనే వివాహం చేసుకున్నాను. మా పెళ్లి కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మా పెళ్లి ఎప్పుడు జరిగినా చాలా అద్భుతంగా జరుగుతుంది.ఇది నేను ఖచ్చితంగా చెప్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అలియా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం అలియా గంగూబాయి కతీయవాడ, ఆర్ఆర్ఆర్ చిత్రాలలో నటిస్తుంది. మరి ఈ సినిమాలతో అలియా రేంజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి.
