Alia Bhatt: అలియా భట్ అందం హిందోళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt: ఇప్పుడు ఎక్కడ చూసినా భారతీయ సినీ అభిమానులు ‘ట్రిపుల్ ఆర్’లోని “నాటు నాటు…” పాట గురించే చర్చించుకుంటున్నారు. తెలుగు సినిమాలకు ఆస్కార్ అసాధ్యం అనుకున్నది “నాటు నాటు…” పాట సుసాధ్యం చేసింది. దాంతో ఆ పాటను స్వరపరచిన కీరవాణి, రాసిన చంద్రబోస్ విజేతలుగా ఆస్కార్ ను అందుకున్నారు. కానీ, వారికన్నా మిన్నగా ఆ చిత్రానికి పనిచేసిన వారందరూ ఆనందిస్తున్నారు. అంతెందుకు, ఆ వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న దీపికా పదుకొణే అవార్డు ప్రకటించగానే ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక ఆ చిత్రంలో నటించిన వారి సంగతి వేరే చెప్పాలా!? ‘ట్రిపుల్ ఆర్’లో సీత పాత్రలో నటించి, తెలుగువారి అభిమానం పొందిన అలియా భట్ ఈ మధ్యే తల్లి అయింది. లేకపోతే, ఆమె కూడా చిత్రబృందంతో పాటు పాలుపంచుకొనేవారేమో! బాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన రణబీర్ కపూర్ భార్య కాకముందే అభినేత్రిగా అలియా భట్ తనదైన బాణీ పలికించారు. తన అందచందాలతో యువతను మరింతగా ఆకట్టుకున్నారు. అలియాకు పెళ్ళయిపోయినా, ఇప్పటికీ ఆమె కొందరు అభిమానులకు హార్ట్ బీట్ అనే చెప్పాలి.
అలియా భట్ 1993 మార్చి 15న జన్మించారు. ఆమె తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకులు. తల్లి సోనీ రజ్దాన్ ప్రముఖ నటి. వారి జీన్స్ కారణంగానే అలియా మనసు సైతం చిన్నతనంలోనే సినిమా రంగంవైపు పరుగులు తీసింది. ఆరేళ్ళ ప్రాయంలోనే తండ్రి రూపొందించిన ‘సంఘర్ష్’లో నటించింది అలియా. ముంబైలోని జమ్నాబాయి నర్సీ స్కూల్ లో ట్వల్త్ గ్రేడ్ వరకూ చదివాక, అలియా సినిమారంగంలో రాణించాలని నిర్ణయించుకుంది. సంజయ్ లీలా భన్సాలీ ‘బాలికా వధూ’ అనే చిత్రాన్ని రూపొందించాలని భావించి, అందులో 12 ఏళ్ళ అలియాను నాయికగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో 20 ఏళ్ళ రణబీర్ ను కథానాయకుడనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా అటకెక్కింది. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో నాయికగా పరిచయమైంది అలియా భట్. “షాన్ దార్, డియర్ జిందగీ, బద్రీనాథ్ కీ దుల్హనియా, రాజి, గల్లీ బాయ్, గంగూబాయ్ కథియవాడియా, ట్రిపుల్ ఆర్” వంటి చిత్రాలలో మురిపించారు అలియా. రణబీర్ కపూర్ తో కలసి ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1-శివ’ గత సంవత్సరమే విడుదలయింది. అలియా నిర్మాణ భాగస్వామిగా రూపొందిన ‘డార్లింగ్స్’ కూడా నిరుడు వెలుగు చూసింది. ప్రస్తుతం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లోనూ, ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే ఆంగ్ల చిత్రంలోనూ అలియా నటిస్తున్నారు.
Also Read
- Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
- Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
- Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
- Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
చిత్రమేంటో కానీ, ‘బాలికా వధూ’లో రణబీర్ కపూర్ తో జోడీ కట్టవలసిన అలియా భట్ తరువాత అతని నిజజీవిత భాగస్వామి కావడం విశేషం! గత సంవత్సరం ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న అలియా భట్ నవంబర్ లోనే ఓ పాపకు జన్మనిచ్చారు. పాప పేరు రహా. ప్రస్తుతం ముంబైలోనే భర్తతో కలసి ఉంటున్న అలియా భట్ కు లండన్ లోనూ ఓ ఇల్లు ఉంది. అలియా భట్ రాబోయే చిత్రాలతో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?