Site icon NTV Telugu

Alec Baldwin:63 ఏళ్ల వయస్సులో తండ్రి కాబోతున్న స్టార్ నటుడు

Alec Baldwin

Alec Baldwin

హాలీవుడ్ నటుడు, నిర్మాత అలెక్‌ బాల్డ్విన్‌ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన కుటుంబంలోకి మరో అతిధి రాబోతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోట్ అవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఆరుగురి సంతానం ఉన్న ఈ 63 ఏళ్ల యాక్టర్‌ ఏదో బిడ్డకు తండ్రి కానున్నాడు. రస్ట్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ నటుడు గత కొన్నేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఒక సినిమా షూటింగ్ సమయంలో అనుకోకుండా గన్ తో ఒక నటుడిని చంపి, డైరెక్టర్ ని గాయపరిచాడు. అప్పట్లో ఈ ఘటన పెనుచంచలనంగా మారింది.

ఇక ఆ వివాదంలో పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న అలెక్‌, అమెరికన్‌ యోగా శిక్షకురాలు హిలేరియా బాల్డ‍్విన్‌ ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఆరుగురు సంతానం. ఇక ఈ విషయాన్ని హిలేరియా తన సోషల్ ఎంసిఐ ద్వారా తెలుపుతూ ” ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మా కుటుంబంలోకి మరో బాల్డ‍్విన్‌ రాబోతుంది. దీంతో మా కుటుంబం సంపూర్ణమైందని అనుకుంటున్నాం.. ఎంతో ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version