Site icon NTV Telugu

Welcome 2 : నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అక్షయ్ కుమార్

Akshay Kumar

Akshay Kumar

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమౌతున్న అక్షయ్ కుమార్, ఆయన ఫ్యాన్స్‌కు ఆకలి తీర్చింది హౌస్ ఫుల్5. తనదైన కామెడీ టైమింగ్ తో  మరోసారి మెస్మరైజ్ చేశాడు ఖిలాడీ. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్‌లోకి సక్సెస్ ఫుల్‌గా అడుగుపెట్టిన హౌస్ ఫుల్ 5 రూ. 200  కోట్ల  కలెక్షన్లకు క్రాస్ చేసి రూ. 300 కోట్లను కొల్లగొట్టే దిశగా జర్నీ చేస్తోంది. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ హిట్ ట్రాక్ ఎక్కేశాడని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అదే వెల్కమ్ టు ది జంగిల్.

Also Read : Exclusive : OG థియేట్రీకల్ రైట్స్ డీల్స్ క్లోజ్.. వివరాలు ఇవే.!

వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తోన్న థర్డ్ వెంచర్ మూవీ. ఎప్పుడో షూటింగ్ స్టార్టైనా ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. దీనికి కారణం అక్షయ్ కుమారేనని టాక్. భూత్ బంగ్లా కన్నా వెనుక స్టార్టైన ఈ మూవీకి ఇంకా గుమ్మడికాయ కొట్టకపోవడానికి కమర్షియల్ అండ్ లాజిస్టిక్ ఇష్యూసేనని వినికిడి. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లోనే థియేటర్లలోకి రావాల్సిన వెల్కమ్ టూ ది జంగిల్ షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది. దీనికి రీజన్ ప్రాఫిట్ షేరింగ్ విషయంలో విబేధాలేనని సమాచారం. సినిమా లాభాల్లో 80 శాతం వాటా అక్షయ్ కు 20 శాతం లాభాలు నిర్మాతలు మరియు ఇతరులకు ఇచ్చేలా ప్రపోజల్ పెట్టాడట అక్షయ్. ఈ వాటాల విషయంలో ప్రొడ్యూసర్స్ అసంతృప్తిగా ఉన్నారన్నది టాక్. ఓ వైపు భారీ బడ్జెట్, మరో వైపు హై రెమ్యునరేషన్. ఇటు లెస్ వాటాలతో మేకర్స్ సతమతమౌతున్నారని సమాచారం. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా, ఇంకా 30 పర్సెంట్ షూట్ జరగాల్సి ఉంది. మరి ప్రొడ్యూసర్స్, హీరోకు మధ్య డీల్ సెట్టయ్యి సినిమా థియేటర్లకు వచ్చేది ఎప్పుడు. లాభాల వాటా విషయం తెగేదెప్పుడో.

Exit mobile version