Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదుర్స్ సినిమాలో గ్యాప్ ఇవ్వురా గ్యాప్ ఇవ్వు. బ్రహ్మానందం చెప్పే డైలాగ్ చాలా ఫేమస్. ఇప్పుడు ఈ డైలాగ్ అక్షయ్ కుమార్‌కు సరిగ్గా సరిపోతుంది. భూత్ బంగ్లాతో సక్సెస్ టేస్ట్ చేశాడో లేదో వెల్కమ్ టు ది జంగిల్‌తో వచ్చేశాడు. ఈ మూవీ థియేట్రికల్ రన్ ముగుస్తుందో లేదో మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. కొన్నేళ్ల నుండి సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తోన్న అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో సాలిడ్ హిట్ టేస్ట్ చేశాడు. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా తట్టుకుని నిలబడి రూ. 250 కోట్లు కొల్లగొట్టింది ఈ హారర్ థ్రిల్లర్. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ జోష్‌తో రెండు నెలల్లోనే వెల్కమ్ టుది జంగిల్ లోడ్ చేశాడు.
ఈ మల్టీస్టారర్ ఫిల్మ్ యావరేజ్ టాక్ తెచ్చుకుని రూ. 150 కోట్లు రాబట్టుకుంది. ఇప్పటికే రెండు సినిమాలతో వచ్చిన ఖిలాడీ హీరో నెక్ట్స్ మరో మూవీ షూటింగ్ స్పీడ్‌గా చేసేస్తున్నాడు. హైవాన్ సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. భూత్ బంగ్లాతో హిట్ కొట్టిన ప్రియదర్శన్- అక్కీ కాంబో ఈ మూవీతో మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ సారి హారర్ కామెడీ జోనర్ పక్కన పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో వస్తున్నారు. మలయాళ ఫిల్మ్ ఒప్పంకి రీమేక్‌గా రాబోతుంది హైవాన్. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు. 18 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఈ మధ్య కాలంలో రీమేక్స్ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అయినా సరే మరోసారి రిస్క్ చేస్తున్నారు ప్రియదర్శన్ అండ్ అక్షయ్ కుమార్.
Also Read
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!