Site icon NTV Telugu

‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్ లో అక్షయ్ ను ఢీ కొట్టనున్న ఇమ్రాన్ హష్మీ!

Akshay Kumar and Emraan Hashmi to Team up for Driving Licence Hindi Remake

2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైనెస్స్’ చక్కని విజయాన్ని సాధించింది. ఓ సూపర్ స్టార్, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ సెన్సిబుల్ పాయింట్ ను నట దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ (జూనియర్ లాల్) హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళ చిత్రంలో స్టార్ హీరోగా పృధ్వీరాజ్ నటించగా, అతని అభిమాని, ఆర్టీఓ ఆఫీసర్ పాత్రను సూరజ్ వెంజరమూడు పోషించాడు.

Read Also : “లవ్ స్టోరీ” 5 రోజుల కలెక్షన్స్

‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ స్టార్ గా నటిస్తుండగా, అభిమాని పాత్రకు ఇమ్రాన్ హష్మీని తాజాగా ఎంపిక చేశారు. ఇప్పటికే దర్శకుడు రాజ్ మెహతా తో అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూజ్’మూవీలో నటించాడు. ఇప్పుడు మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెస్స్’ హిందీ రీమేక్ లో నటింబోతున్నాడు. దీన్ని ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. విశేషం ఏమంటే… అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించడం అనేది ఇదే మొదటిసారి. జనవరిలో సినిమా షూటింగ్ ను ప్రారంభించి, నలభై రోజుల్లో యు.కె.లో పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇది రీమేక్ మూవీనే అయినా, స్క్రిప్ట్ లో నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులూ చేస్తున్నారట. ధర్మా ప్రొడక్షన్స్ లో ఇమ్రాన్ హష్మీ ‘ఉంగ్లీ’ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా అది. అలానే సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’లోనూ ఇమ్రాన్ పాకిస్తాన్ ఇంటెలిజన్స్ ఏజెంట్ పాత్రను పోషిస్తున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న ‘గంగూభాయి కతియావాడీ’లోనూ అతిథి పాత్రలో ఇమ్రాన్ కనిపించబోతున్నాడు.

Exit mobile version