అక్షయ్ భారీ విరాళంతో… పాడుబడిన పాఠశాలకు ‘కోటి’ మెరుగులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్ మరోసారి తన దాన గుణం చాటుకున్నాడు. అంతే కాదు, దేశం పట్ల తన భక్తిని కూడా ఆయన మరోసారి ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శించాడు. పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఇండియా ప్రమాదంలో ఉంటే భారీగా విరాళం ప్రకటించిన ఖిలాడీ స్టార్ ఈ సారి బీఎస్ఎఫ్ జవాన్ల కోసం స్పందించాడు. అదీ చదువుకు సంబంధించిన గొప్ప పని కోసం కోటి రూపాయల విరాళం అందించాడు. కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ నడిపే ఓ స్కూల్ కోసం అక్కీ ఆర్దిక సాయం అందించాడు. జూన్ లో కాశ్మీర్ కి వెళ్లిన అక్షయ్ కుమార్ బీఎస్ఎఫ్ జవాన్లతో కొంత సేపు గడిపాడు.
రియల్ హీరోస్ ని కలుసుకోవటం సంతోషంగా ఉందంటూ ట్వీట్ కూడా చేశాడు. అయితే, కాశ్మీర్ లోనే ఓ పాఠశాల భవనం పాడుబడి కనిపించటంతో ఆయన దాని పునర్ నిర్మాణం కోసం కోటి రూపాయలు అప్పుడే విరాళంగా ప్రకటించాడు. తాజాగా బీఎస్ఎఫ్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో సదరు స్కూలు నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకం ఫోటోను షేర్ చేసింది. అక్షయ్ కుమార్ పేరు కూడా ‘పద్మ శ్రీ’తో సహా మనం ఫౌండేషన్ స్టోన్ పై చూడవచ్చు. న్యూ స్కూల్ బిల్డింగ్ పేరుని ‘హరీ ఓం భాటియా ఎడ్యుకేషన్ బ్లాక్’గా వ్యవహరించనున్నారు. అక్షయ్ తండ్రి పేరు హరీ ఓం భాటియా! వరుసగా చిత్రాలు చేస్తోన్న అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘బచ్చన్ పాండే’తో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘బెల్ బాటమ్, పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు’ కూడా రానున్న కాలంలో అలరించనున్నాయి…
Also Read
- Rashmika : "ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్".. 'ఎపిక్' వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
- Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
తాజావార్తలు
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!