Akshara Singh: భోజ్ పురి హీరోయిన్ అక్షరా సింగ్ గురించి వినే ఉంటారు.. గత కొన్నిరోజుల క్రితం ఆమె పర్సనల్ వీడియో ఒకటి నెట్టింట లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. భోజ్ పురి బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన అక్షర ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకొంటుంది. ఇటు పక్క బాలీవుడ్ లోనూ ఆమె నటిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తితో ఆమె కలిసి ఉన్న వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ఒక రూమ్ లో ఆమె ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అది కాస్తా వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇక తాజాగా ఈ వీడియోపై అక్షర స్పందించింది. ఆ వీడియో లో ఉన్నదితాను కాదని స్పష్టం చేసింది.
“ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. అది ఎవరో కావాలని నా ఫోటోను మార్ఫింగ్ చేసి చూపించారు. అలాంటి పని ఎవరు చేసినా నేను పట్టించుకోను.. ఎందుకంటే అందులో ఉన్నది నేను కాదు కాబట్టి. విమర్శలు వచ్చినా, కామెంట్స్ వచ్చినా వాటిని వినాలని కూడా నేను అనుకోవడంలేదు. నా మీద కోపంతో ఎవరో ఈ పిచ్చి పనులు చేసి ఉంటారు. ఇప్పటివరకు నేను ఆ వీడియో కూడా చూడలేదు.. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇలాంటి పనులు నన్ను బాధించలేవు” అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అక్షర మీద అంత కోపం ఉన్నది ఎవరికి..? ఆమెపై అంత కోపం పెంచుకోవాల్సిన అవసరం ఏముంది..? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.