Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. అక్టోబర్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెన్ కర్నూల్ లో నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున.. మహేష్ బాబు తో సినిమా గురించి ఓపెన్ అయ్యాడు. ది ఘోస్ట్ టీజర్ ను మహేష్ బాబు రిలీజ్ చేసిన విషయం విదితమే. ఇక ఆ సమయంలో నాగ్, మహేష్ కు థాంక్స్ చెప్తూ.. మీ నాన్న నేను వారసుడు సినిమా చేశాం.. ఆ సర్కిల్ ను మనం ముగిద్దాం అని చెప్పుకు వచ్చాడు. అందుకు మహేష్ సైతం తప్పకుండా చేద్దాం అని చెప్పడంతో మహేష్- నాగ్ ల మధ్య మల్టీస్టారర్ ఉంటుందని అభిమానులు ఎంతో ఆనందించారు.
ఇక తాజాగా ఈ ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి నాగ్ కు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. అభిమానులు మహేష్ తో మీ సినిమా ఎప్పుడు అని అడుగుతున్నారు.. అందుకు మీ సమాధానం ఏంటి అని అడుగగా.. మహేష్ ఎప్పుడు ఒకే అంటే అప్పుడే అని చెప్పి షాక్ ఇచ్చాడు. అంటే కథకు మహేష్ ఒకే చెప్పాలే కానీ నాగ్ ఎప్పుడు ముందే ఉన్నాడని అర్ధమయ్యింది. ఇక దీంతో అక్కినేని, ఘట్టమనేని అభిమానులు మహేష్ త్వరగా ఓకే చెప్పు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి యాక్షన్ హీరోలుగా ఆ కథ చేయండి.. ఈ కథ చేయండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. మరి ఏ ఏకాంబో ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.