Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజు ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ తో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌కు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కొడుకు సక్సెస్ చూసి ఒక తండ్రిగా నాగ్ కాస్త ఎమోషన్ అయ్యారు.
నాగార్జున మాట్లాడుతూ.. “నేను గతంలో ‘అన్నమయ్య’ సినిమా చేసినప్పుడు కానీ, ఆ తర్వాత ఎప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు కానీ దేవుణ్ణి ప్రత్యేకంగా ఏమీ కోరుకోలేదు. నా జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఇటీవల నేను స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ఒక్కటే కోరుకున్నాను.. మా అఖిల్‌కు ఒక మంచి హిట్ ఇవ్వండి స్వామి అని అడిగాను. ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ఈరోజు ‘లెనిన్’ రూపంలో ఒక సాలిడ్ హిట్ వచ్చింది”. ఈ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా అఖిల్ కు ఒక మంచి హిట్ పడాలని గట్టిగా కోరుకుందట. చివరికి ఆమె కోరిక కూడా నెరవేరింది. ‘లెనిన్’ మూవీతో ఆమెకు కూడా ఒక సూపర్ హిట్ లభించింది” అని నాగార్జున పేర్కొన్నారు. అఖిల్ 2.0 రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్, భాగ్యశ్రీ యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
తాజావార్తలు
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..