Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Akkineni Nagarjuna Naa Saami Ranga No Promotions

Akkineni Nagarjuna: రేసులో ఉంచడం ముఖ్యం కాదు బాసూ.. హైప్ ఎక్కించడం ముఖ్యం.. ?

Published Date :January 5, 2024 , 9:51 pm
By Roja Pantham
Akkineni Nagarjuna: రేసులో ఉంచడం ముఖ్యం కాదు బాసూ.. హైప్ ఎక్కించడం ముఖ్యం.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Akkineni Nagarjuna: ఈ సంక్రాంతి పోటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు స్టార్ హీరోల సినిమాలు.. సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఎవరికి తగ్గ ప్రమోషన్స్ వారు చేసుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజ వెనక్కి తగ్గదు. ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9 ను లాక్ చేసుకుంది. ఇక ఈగల్ తగ్గడంతో.. నాలుగు సినిమాలు మిగిలాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామీ రంగా. ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే. ఒక్క హనుమాన్ ను పక్కన పెడితే.. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున మధ్య పెద్ద పోటీనే ఉంది. సంక్రాంతికి ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ కాలంలో సినిమా ఎలా ఉన్నా కూడా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్ పెంచడం వలనే ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రమోషన్ల విషయంలో మహేష్ బాబు, వెంకటేష్, తేజ సజ్జా ఢోకా లేకుండా చేసేస్తున్నారు.

గుంటూరు కారం కు ఎప్పటినుంచో హైప్ ఉంది. నిత్యం నాగవంశీ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మరింత హైప్ పెంచుతున్నాడు. ఇక హనుమాన్.. మొదటి సూపర్ హీరో సినిమా అని, దైవ భక్తితో ప్రశాంత్ వర్మ ఎలాగో మార్కులు కొట్టేశాడు. ఇక వెంకటేష్.. సైంధవ్ కూడా ట్రైలర్ రిలీజ్ చేసి.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచుతుంది. ఒక్క నాగ్ మాత్రమే ఇంకా అనుకున్న ప్రమోషన్స్ ను, హైప్ ను రీచ్ కాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇంకా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. ఆ షూట్ బిజీలో ఉండి..ప్రమోషన్స్ సరిగ్గా చేయలేకపోతున్నారు. లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయినా కూడా వాటికి సరైన ప్రమోషన్స్ లేక హైప్ రావడంలేదు. ఇంకా ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ అన్ని పూర్తి చేసుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. ఇంత తక్కువ టైమ్ లో ఇవన్నీ అవుతాయా.. ? అనేది డౌట్. రేసులో ఉంచడం ముఖ్యం కాదు బాసూ.. హైప్ ఎక్కించడం ముఖ్యం.. నాగ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akkineni Nagarjuna
  • Naa Saami Ranga
  • sankranthi 2024
  • Tollywood News

తాజావార్తలు

  • SRH Vs LSG: తడబడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. 20 ఓవర్లకు 156 పరుగులు..

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

  • India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

  • Smartphone Price Hike: మొబైల్ కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన ఈ కంపెనీల ఫోన్ల ధరలు.. ఎంతంటే?

  • Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions