NTV Telugu Site icon

Akkineni Nagarjuna: యాడ్స్ సరే.. సినిమా ఎప్పుడు..?

Nag

Nag

Akkineni Nagarjuna: ఘోస్ట్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ మధ్య సోషల్ మేడీఐలో చాలా తక్కువ కనిపిస్తున్న నాగ్.. బయట విషయాలను ఎక్కువగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక సినిమాలతో పాటు నాగ్ కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు. టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు తరువాతఎక్కువ యాడ్స్ లో కనిపించే హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది నాగ్ మాత్రమే. ఘడి డిటర్జెంట్ పౌడర్, కళ్యాణ్ జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న నాగ్ మరో కొత్త వాణిజ్య ప్రకటనలో కనిపించి మెప్పించాడు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే తో కలిసి మాజా యాడ్ లో సందడి చేశాడు. బుట్ట బొమ్మ గత కొంత కాలంగా మాజా బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.వీరిద్దరు కలిసి ఈ మధ్యనే ఈ యాడ్ షూట్ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక తాజగా ఈ యాడ్ ను నాగ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Michael Jackson: ఇన్నాళ్లకు మైకేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?

ఇక ఈ ప్రకటనలో నాగ్, పూజా ఒకే అపార్ట్మెంట్ లో నివసించేవారిగా కనిపించారు. మాజా యొక్క గొప్పతనం మొత్తం మామిడి కాయలోనే ఉందని చెప్తూ.. మామిడికాయ మంచితనం గురించి నాగ్ వివరించాడు. ఇక ఈ యాడ్ లో నాగ్ లుక్ అదిరిపోయింది. పూజా పక్కన కుర్ర హీరోలానే నాగ్ కనిపించాడు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక యాడ్ ను చూసిన వారందరు.. యాడ్స్ సరే.. సినిమా ఎప్పుడు..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నాగ్.. బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఈ సినిమాతో నాగ్.. అభిమానులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.

Show comments