Akkineni Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్.. ఇక నిద్రలేచే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు అక్కినేని నాగార్జున సినిమా ప్రకటించడానికి రెడీ అయిపోయాడు. అయితే సోలో హీరోగా కాదు.. మల్టీస్టారర్ గా అంట. ఏంటి.. ఈసారి అఖిల్ తోనా, చైతన్యతోనా అని ఆలోచిస్తున్నారా.. ? లేదు లేదు.. ఈసారి నాగ్ రూటు మార్చాడు.. కొడుకులతో కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మల్టీస్టారర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధనుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. అందులో ఒకటి శేఖర్ కమ్ముల సినిమా. అక్కినేని నాగ చైతన్యతో లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమా చేసిన తరువాత శేఖర్ కమ్ముల, ధనుష్ తన తరువాతి సినిమా ప్రకటించిన విషయం తెల్సిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ అయ్యి చాలా కాలం అవుతున్నా ధనుష్ డేట్స్ వలన ఆలస్యం అవుతూ వచ్చిందని టాక్.
Big Breaking: ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చరణ్ రావడం లేదట
మొదట ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా అనుకున్నా.. కథ పూర్తీ అయ్యేసరికి మల్టీస్టారర్ గా మారిందని తెలుస్తోంది. కథలో మరో పాత్ర కూడా చాలా కీలకమని, అందుకే ఆ పాత్రకు మరో స్టార్ హీరోను తీసుకొని మల్టీస్టారర్ గా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ స్టార్ హీరోగా అక్కినేని నాగార్జునను ఎంపిక చేశారట. నాగ్ కు కూడా కథ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే అన్నట్లు తెలుస్తోంది. నాగ్ కు వేరే హీరోలతో స్క్రీన్ పంచుకోవడం కొత్తేమి కాదు. ఊపిరి సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో నాగ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. ఇక ఇందులో ధనుష్ సరసన రష్మిక నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. మరి ఊపిరి తరహాలో నాగ్ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.