Site icon NTV Telugu

Agent: ‘ఏజెంట్’ పనైపోయింది… ఇక ఆ భారం అఖిల్ పైనే

Agent

Agent

అక్కినేని అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా టైం తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు సూరి. కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క హిట్ మాత్రమే అందుకున్న అఖిల్ కూడా ఏజెంట్ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్పై యాక్షన్ సినిమాతో మాస్ ఫాలోయింగే కాదు పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు అఖిల్. ఫిజిక్ లో సాలిడ్ మేకోవర్ చూపించి అఖిల్, తన పాత్రకి ఎంత చెయ్యాలో అంత ఎఫోర్ట్ పెడుతున్నాడు. అఖిల్ ఎంత కష్టపడినా ‘ఏజెంట్’ మాత్రం అనుకున్న సమయానికంటే ఎక్కువగా డిలే అయిపోయింది. ఇప్పటికే డిలే అవుతూ వచ్చిన ఏజెంట్ సినిమా ఫైనల్‌గా ‘హిట్ ట్రాక్’ ఉన్న డేట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతున్నాడు. అయితే పాన్ ఇండియా స్కేల్ ఉన్న ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదు. గ్లిమ్ప్స్ అండ్ టీజర్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్, బజ్ మరో ప్రమోషనల్ కంటెంట్ చెయ్యలేకపోయింది. హిప్ హాప్ తమిళ ఇచ్చిన సాంగ్స్ కూడా సోసోగానే ఉన్నాయి. ఈ కారణాల వలనే ఏజెంట్ సినిమాకి హైప్ రావట్లేదు.

రీసెంట్‌గా అక్కినేని అఖిల్ ఇంటర్య్వూస్ స్టార్ట్ చేశాడు కానీ ఏజెంట్‌ సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వాలి అంటే ఇది సరిపోదు. ఈ సినిమాకు అఖిల్ మార్కెట్‌కు మించి ఖర్చు పెట్టారు. మరి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఖచ్చింతగా భారీ హైప్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని మర్చిపోయి ఇంకా షూటింగ్‌ చేస్తునే ఉంది ఏజెంట్ టీమ్. సినిమా రిలీజ్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయినా ఇప్పటి వరకు షూటింగ్ చేస్తున్నారంటే.. ఏజెంట్ ఎంత డిలేనో అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ని షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్‌లో వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్‌తో స్టెప్పులేసిన హాట్ బ్యూటీ ‘ఊర్వశి రౌటేలా’ చిందేస్తోందట. ఇక ఈ పాటతో ఏజెంట్ షూటింగ్ దాదాపుగా అయిపోనట్టేనని అంటున్నారు. నెక్స్ట్ ప్రమోషన్స్ కోసం అఖిల్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా రంగంలోకి దిగాలి. ఏప్రిల్ 28న రిలీజ్ అంటే మరో రెండు వారాల మధ్యే సమయం ఉంది కాబట్టి అఖిల్ ఇండియా మొత్తం తిరగాలి, ప్రతి చోటా ప్రమోషన్స్ చెయ్యాలి. అప్పుడే అఖిల్ ‘ఏజెంట్’ సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుంది లేదంటే తెలుగుకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version