Agent: ‘ఏజెంట్’ పనైపోయింది… ఇక ఆ భారం అఖిల్ పైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా టైం తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు సూరి. కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క హిట్ మాత్రమే అందుకున్న అఖిల్ కూడా ఏజెంట్ పై బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ స్పై యాక్షన్ సినిమాతో మాస్ ఫాలోయింగే కాదు పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు అఖిల్. ఫిజిక్ లో సాలిడ్ మేకోవర్ చూపించి అఖిల్, తన పాత్రకి ఎంత చెయ్యాలో అంత ఎఫోర్ట్ పెడుతున్నాడు. అఖిల్ ఎంత కష్టపడినా ‘ఏజెంట్’ మాత్రం అనుకున్న సమయానికంటే ఎక్కువగా డిలే అయిపోయింది. ఇప్పటికే డిలే అవుతూ వచ్చిన ఏజెంట్ సినిమా ఫైనల్‌గా ‘హిట్ ట్రాక్’ ఉన్న డేట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతున్నాడు. అయితే పాన్ ఇండియా స్కేల్ ఉన్న ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్స్ జరగడం లేదు. గ్లిమ్ప్స్ అండ్ టీజర్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్, బజ్ మరో ప్రమోషనల్ కంటెంట్ చెయ్యలేకపోయింది. హిప్ హాప్ తమిళ ఇచ్చిన సాంగ్స్ కూడా సోసోగానే ఉన్నాయి. ఈ కారణాల వలనే ఏజెంట్ సినిమాకి హైప్ రావట్లేదు.
రీసెంట్గా అక్కినేని అఖిల్ ఇంటర్య్వూస్ స్టార్ట్ చేశాడు కానీ ఏజెంట్ సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వాలి అంటే ఇది సరిపోదు. ఈ సినిమాకు అఖిల్ మార్కెట్‌కు మించి ఖర్చు పెట్టారు. మరి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఖచ్చింతగా భారీ హైప్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని మర్చిపోయి ఇంకా షూటింగ్ చేస్తునే ఉంది ఏజెంట్ టీమ్. సినిమా రిలీజ్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయినా ఇప్పటి వరకు షూటింగ్ చేస్తున్నారంటే.. ఏజెంట్ ఎంత డిలేనో అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ని షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్‌లో వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్‌తో స్టెప్పులేసిన హాట్ బ్యూటీ ‘ఊర్వశి రౌటేలా’ చిందేస్తోందట. ఇక ఈ పాటతో ఏజెంట్ షూటింగ్ దాదాపుగా అయిపోనట్టేనని అంటున్నారు. నెక్స్ట్ ప్రమోషన్స్ కోసం అఖిల్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా రంగంలోకి దిగాలి. ఏప్రిల్ 28న రిలీజ్ అంటే మరో రెండు వారాల మధ్యే సమయం ఉంది కాబట్టి అఖిల్ ఇండియా మొత్తం తిరగాలి, ప్రతి చోటా ప్రమోషన్స్ చెయ్యాలి. అప్పుడే అఖిల్ ‘ఏజెంట్’ సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుంది లేదంటే తెలుగుకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!