Site icon NTV Telugu

Agent: అయ్యగారు బాలీవుడ్ హీరోలా ఉన్నాడు…

Agent

Agent

అక్కినేని ప్రిన్స్ అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చేసిన హంగామా పాన్ ఇండియా మొత్తం వినిపించింది. టీజర్ క్రియేట్ చేసిన హావోక్ అయితే మూడు నాలుగు రోజుల పాటు ఇంపాక్ట్ చూపించింది. ఇక ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ ప్రమోషనల్ కంటెంట్ నుంచి కాస్త లవ్ సైడ్ వచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ నుంచి ‘మళ్లీ మళ్లీ’ అనే సాంగ్ లిరికల్ సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు. “#MalliMalli నువ్వే ఎదురెదురోస్తే that’s a sign అని మనసు అంటుందే, నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే, సాదించాలనిపిస్తుందే… పిల్లా నీ వల్లే దిల్ ఇలా ధక్ ధక్, ఏంటో పెరిగేనిలా నీలో ఇక చూడాలా, జరుగునో లేదో ఈ మాయా, అది లవ్వో నీ నవ్వో అయ్యా రోమియో ఓ అమ్మాయో…” అంటూ సాగిన ఈ సాంగ్ లో రిక్ విజువల్స్ ఉన్నాయి.

DOP రసూల్ సినిమాటోగ్రఫి లీడ్ పెయిర్ ని చాలా అందంగా చూపించింది. ఆదిత్య అయ్యంగార్ రాసిన లిరిక్స్ కి, హిప్ హాప్ తమిళ క్యాచీ ట్యూన్ ఇవ్వడమే కాకుండా ‘మళ్లీ మళ్లీ’ పాటని తనే పాడడం విశేషం. అఖిల్, సాక్షిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ కలిసి కనిపిస్తే హిట్ పెయిర్ ని చూసినట్లు ఉంది. ముఖ్యంగా అఖిల్ లాంగ్ హెయిర్ తో బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. తన మొదటి సినిమా నుంచి డాన్స్ బాగా చేసే అఖిల్, మళ్లీ మళ్లీ సాంగ్ లో కూడా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ డాన్స్ వేసినట్లు ఉన్నాడు. రాజు సుందరం మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ లిరికల్ వీడియోలో అట్రాక్ట్ చేశాయి. ఓవరాల్ గా ఇప్పటివరకూ సీరియస్ కంటెంట్ మాత్రమే రిలీజ్ చేసిన ఏజెంట్ మేకర్స్, ఇప్పుడు లవ్ సాంగ్ ని రిలీజ్ చేసి మంచి చేంజ్ ఓవర్ చూపించారు.  

https://www.youtube.com/watch?v=fQcTz2U0kEM

Exit mobile version