Agent: అయ్యగారు బాలీవుడ్ హీరోలా ఉన్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని ప్రిన్స్ అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చేసిన హంగామా పాన్ ఇండియా మొత్తం వినిపించింది. టీజర్ క్రియేట్ చేసిన హావోక్ అయితే మూడు నాలుగు రోజుల పాటు ఇంపాక్ట్ చూపించింది. ఇక ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ ప్రమోషనల్ కంటెంట్ నుంచి కాస్త లవ్ సైడ్ వచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ నుంచి ‘మళ్లీ మళ్లీ’ అనే సాంగ్ లిరికల్ సాంగ్ వీడియోని రిలీజ్ చేశారు. “#MalliMalli నువ్వే ఎదురెదురోస్తే that’s a sign అని మనసు అంటుందే, నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే, సాదించాలనిపిస్తుందే… పిల్లా నీ వల్లే దిల్ ఇలా ధక్ ధక్, ఏంటో పెరిగేనిలా నీలో ఇక చూడాలా, జరుగునో లేదో ఈ మాయా, అది లవ్వో నీ నవ్వో అయ్యా రోమియో ఓ అమ్మాయో…” అంటూ సాగిన ఈ సాంగ్ లో రిక్ విజువల్స్ ఉన్నాయి.
DOP రసూల్ సినిమాటోగ్రఫి లీడ్ పెయిర్ ని చాలా అందంగా చూపించింది. ఆదిత్య అయ్యంగార్ రాసిన లిరిక్స్ కి, హిప్ హాప్ తమిళ క్యాచీ ట్యూన్ ఇవ్వడమే కాకుండా ‘మళ్లీ మళ్లీ’ పాటని తనే పాడడం విశేషం. అఖిల్, సాక్షిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ కలిసి కనిపిస్తే హిట్ పెయిర్ ని చూసినట్లు ఉంది. ముఖ్యంగా అఖిల్ లాంగ్ హెయిర్ తో బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. తన మొదటి సినిమా నుంచి డాన్స్ బాగా చేసే అఖిల్, మళ్లీ మళ్లీ సాంగ్ లో కూడా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ డాన్స్ వేసినట్లు ఉన్నాడు. రాజు సుందరం మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ లిరికల్ వీడియోలో అట్రాక్ట్ చేశాయి. ఓవరాల్ గా ఇప్పటివరకూ సీరియస్ కంటెంట్ మాత్రమే రిలీజ్ చేసిన ఏజెంట్ మేకర్స్, ఇప్పుడు లవ్ సాంగ్ ని రిలీజ్ చేసి మంచి చేంజ్ ఓవర్ చూపించారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
https://www.youtube.com/watch?v=fQcTz2U0kEM
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..