NTV Telugu Site icon

Akkada Ammayi Ikkada Abbayi: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇన్నాళ్లకు కలిశారు!

Akkada Ammai Ikkada Abbai

Akkada Ammai Ikkada Abbai

Akkada Ammayi Ikkada Abbayi Re Union after 27 Years: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈరోజు నిర్మాతలతో కలిసి స్పెషల్ ఫ్లయిట్ లో గన్నవరం వెళ్లి పవన్ ను కలిశారు. నిజానికి ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో వీళ్లిద్దరూ హీరో, హీరోయిన్లుగా లాంచ్ అయ్యారు. సుప్రియ ఆ తరువాత సినిమాలకు దూరమైంది.

Sapthami Gowda : నేను తప్పు చేశా.. నేను మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ ఆడియో వైరల్!

నటనకు దూరం అయినా నిర్మాతగా మారి అన్నపూర్ణ బ్యానర్ లో పలు సినిమాలకు నిర్మాణ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగిన క్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఎప్పుడూ వీరిద్దరూ కలిసి నటించలేదు అనే కంటే నటించే అవకాశం రాలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్, హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ అయిన సుప్రియా కలవడం కాస్త చర్చనీయాంశం అయిందనే చెప్పాలి.